POLITICS

మాజీ ముఖ్యమంత్రి ,కాంగ్రెస్ జాతీయ నాయకుడు దిగ్విజయ్ సింగ్ రాసలీలలు నెట్ లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. లేటు వయసులో ఈ ఘాటు రొమాన్స్ ఏంటి అంటూ ఈ అనైతిక పనుల గురించి అందరూ చీదరించుకుంటుంటే సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ మాత్రం డిగ్గీ రాజా కు మద్దతు ఇస్తున్నాడు. అపుదేపుడో ఇరవయ్యేళ్ళ క్రితం వచ్చిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలో షారుఖ్ -కాజల్ ల మద్య అంత రొమాంటిక్ లుక్ తర్వాత ఇప్పుడు డిగ్గీ రాజా -అమృతా రాయ్ లో ఆ రొమాంటిక్ లుక్ చూస్తున్నా అంటూ తన అభిప్రాయాన్ని చెబుతున్నాడు . నిజమే వర్మ చెప్పేంత వరకు ఆలోచించలేదు కానీ డిగ్గీ రాజా  పెద్ద రాజకీయ నాయకుడే కానీ అంతకు మించిన శృంగార పురుషుడు అని ఈ స్టిల్స్ చూస్తుంటే తెలుస్తోంది. 67ఏళ్ల డిగ్గీ రాజా ఓ కుర్ర యాంకర్ తో సరస సల్లాపాల్లో మునిగి తేలిన సమయంలో తీసిన హాట్ ఫోటోలు నెట్ లో దర్శనం ఇవ్వడంతో చిరిగి చాటయ్యింది . అయినప్పటికీ నాదే పై చేయి అంటున్నాడు డిగ్గీ రాజా ,పెళ్లై న ఓ స్త్రీ తో అనైతిక పనులు చేస్తూ ……… ఆమె భర్త కు విడాకులు ఇప్పించి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడట డిగ్గీ .

నాగార్జున – మహేష్ బాబులతో మణిరత్నం దర్శకత్వంలో తెరకేక్కే మల్టీస్టారర్ నుంచి మహేష్ పూర్తిగా తప్పుకున్నట్లే అని టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త. ఆమధ్యే నాగార్జున స్వయంగా ప్రకటించిన ఈ సినిమా నుంచి మహేష్ తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఐశ్వర్యారాయ్ శృతి హసన్ హీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్నట్లు త్వరలో ప్రారంభం కాబోతుండగా ఇప్పుడు పూర్తిగా ఆగినట్లే అని వినిపిస్తుంది. కారణాలేవైనా మరో తెలుగు లేదా తమిళ స్టార్ హీరో మహేష్ స్థానంలో ఉంటారా లేదా అనే సంగతి త్వరలో తెలియనున్నది. మణిరత్నం సినిమా బదులుగా మహేష్ ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా అంగీకరించాడని జులాయి నిర్మాత రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఆగడు సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నది. మణిరత్నం సినిమా నుంచి మహేష్ తప్పుకోవడానికి పలు కారణాలు తెలుస్తున్నాయి మహేష్ బాబు తన కాల్షీట్స్ ఏమాత్రం ఆలోచించకుండా అందరికి ఇచ్చాడని ఇప్పుడు వాటిని సర్దుబాటు చేయలేక చివరకు సినిమాలు కాన్సిల్ చేసుకోవలసిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు.

Krishnaఅప్పటికి ముప్పయ్యేళ్లు కూడా పూర్తి కాలేదు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లకి స‌బ్ జూనియ‌ర్ అనుకోవ‌చ్చు. అయినా స‌రే… ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోటీనిచ్చాడు ఘ‌ట్టమనేని కృష్ణ. అందుకే బుర్రిపాలెం బుల్లోడు కాస్త సూప‌ర్‌స్టార్ అయిపోయాడు. ఆయ‌న తీసుకొన్నన్ని సాహ‌సోపేత‌మైన నిర్ణయాలు చిత్ర ప‌రిశ్రమ‌లో మ‌రెవ్వరూ తీసుకోలేదేమో. కొత్తద‌నం అంటే అది కృష్ణ నుంచే రావాల‌ని అప్పట్లో చెప్పుకొనేవారు. 30 యేళ్ల వ‌య‌సుకే వంద సినిమాల మైలురాయికి చేరుకొన్న ఘ‌న‌త ఆయ‌న‌ది. వందో సినిమాకి `అల్లూరి సీతారామ‌రాజు` చేశారు. ఆ సినిమాని ట‌చ్ చేయ‌డానికి ఎన్టీఆర్‌, శోభ‌న్‌బాబులాంటి ఉద్ధండులే వెన‌క్కి త‌గ్గారు. కానీ కృష్ణ మాత్రం ధైర్యంగా ముంద‌డుగు వేశారు.

`అల్లూరి సీతారామ‌రాజు` అంటూ కృష్ణే అనేంత‌గా ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఆ క‌థ‌కి వ‌న్నె తెచ్చారు. ఆ చిత్రం విడుద‌లై 1974 మే 1న విడుదలైంది. అంటే నేటికి స‌రిగ్గా న‌ల‌భై యేళ్లు. కృష్ణ వందో చిత్రం మాత్రమే కాదిది. తెలుగులో స్కోప్‌లో వ‌చ్చిన తొలి సినిమా ఇది. ఈ సినిమాని చూసిన ఎన్టీఆర్… కృష్ణని గ‌ట్టిగా హ‌త్తుకొన్నారు. ఇంత‌కంటే గొప్పగా మ‌రెవ్వరూ చేయ‌లేర‌ని అభినందించార‌ట‌. అప్పటిదాకా అల్లూరిగా న‌టించాల‌నుకొన్న ఆయ‌న ఆ ప్రయ‌త్నాన్ని విరమించుకొన్నార‌ట‌. కృష్ణ అంత‌టి ప్రభావాన్ని చూపేలా అందులో న‌టించారు. సినిమా న‌ల‌భ‌య్యేళ్లు పూర్తి చేసుకొన్న సంద‌ర్భంగా కృష్ణ‌, విజ‌య‌నిర్మల త‌మ ఆనందాన్ని విలేక‌రుల‌తో పంచుకొన్నారు. ఇదొక చ‌రిత్ర అనీ, ఎప్పటికీ మ‌రుపురాని చిత్రమ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

బాలీవుడ్ లో విద్యాబాలన్ నటించిన ‘కహానీ’ నుంచి కేవలం మూల కథనే తీసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల, యండమూరితో కలిసి ‘అనామిక’ను సృష్టించాడు. ‘కహానీ’కి రీమేక్ కాదు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే విద్యాబాలన్ ప్రెగ్నెంట్ గా రావడం.. క్లైమాక్స్ లో ప్రెగ్నెంట్ కాదని రివీల్ అవ్వడమే కహానీ లో పెద్ద థ్రిల్. కానీ అటువంటి థ్రిల్ ని కాదని కొత్త కథను రాసుకోవడం కాస్త రిస్క్ అయినా శేఖర్ కొత్త దారిలో నడిచేందుకే ప్రయత్నించాడు. అందుకు ప్రతిఫలంగా ‘అనామిక’ రూపం మారింది. అయితే ‘కహానీ’ తో పోల్చితే.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా మొదలైన పదినిముషాలు ఆసక్తిగా సాగినా .. ఆ తర్వాత స్లోగా మారింది. కథలోకి తీసుకెళ్లడానికి చాలా టైమ్ పట్టింది. దీంతో ఫస్టాఫ్ లో ఆసక్తి తగ్గింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా చెప్పుకునే ఈ మూవీలో థ్రిల్లింగ్ లేకపోవడమే ఆడియెన్స్ కు కాస్త బోర్ కొట్టించింది. ఇక సెకాండాఫ్ మాత్రం చాలా వేగంగా సాగుతుంది. ఇన్వెస్టిగేషన్ చేసే సన్నివేశాలు మూవీపై ఆసక్తిని పెంచాయి. అయితే ఈ చిత్రంలో చాలా లాజిక్ లు వదిలేశాడు శేఖర్. దర్శకునిగా అతని వైఫల్యం ఇది. ‘అనామిక’ భర్త ఉగ్రవాదని తనకు ఎప్పుడు తెలిసింది..? ఎలా తెలిసింది..? అనే చాలా ప్రశ్నలకు సమాధానం లేదు. అంతేకాదు.. ‘అనామిక’తన భర్త విషయంలో.. సమాజం పట్ల ప్రేమా లేక తను మోసపోయాననే పగా.. ? అనామిక ఎందుకు ఇలా చేసిందనే దానిపై క్లారిటీ లేదు.సినిమాకి నయనతారే పెద్ద అసెట్. గ్లామర్ గా కనిపిస్తూనే అవసరమైన చోట పవర్ పుల్ గా మారింది. తను ఏడుస్తూ.. ఆడియెన్స్ ను కూడా కాస్త ఏడిపిస్తూ.. పాత బస్తీలో తిరిగింది. ఇక మ్యూజిక్ విషయంలో కీరవాణి సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. రెండు పాటలే ఉన్నా.. ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. సాధారణంగా కనిపించే సన్నివేశాలకు కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. తెర మీద హీరో నయనతార అయితే తెర వెనుక హీరో కీరవాణి అయ్యాడు. సస్పెన్స్ థ్రిల్లర్ అయిన ‘అనామిక’లో ఫొటోగ్రఫీకి, కామెడీకి ఛాన్స్ లేదు. వైభవ్ పాత్ర తేలిపోయింది. పోలీస్ ఆఫీసర్ గా చాలా పేలవంగా కనిపించాడు. పశుపతి, హర్షవర్ధన్ రాణే ల నటన ఫర్వాలేదనిపించారు. క్లైమాక్స్ లో శేఖర్ ఇచ్చిన ట్విస్ట్ బాగుంది.

ఈమ‌ధ్య వ‌స్తున్న ప్రేమ క‌థ‌ల ట్రెండ్ మారింది. క‌థానాయ‌కుడిలో ఉన్న నెగిటీవ్ ల‌క్షణాలే.. విల‌న్ పాత్ర పోషిస్తున్నాయి. అది నేటి ట్రెండ్‌. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా 100 % ల‌వ్‌, ఆహా క‌ల్యాణం లాంటి సినిమాలొచ్చాయి. ఇంత‌కు ముందూ ఇలాంటి క‌థల‌తో సినిమాలు తీసినా కొత్త జంట‌లో మాత్రం ఈ రెండు సినిమాల ప్రభావం కాస్త ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.బూతు ముద్రని వదిలించుకునే ప్రాసెస్ లో మారుతి సినిమాల్లో కనపించి ఆకట్టుకునే కామెడీ, యూత్ ఆలోచనలు, సమస్యలు,జోష్ కూడా మిస్సైపోయాయి. దాంతో ఈ చిత్రం రెగ్యులర్ రొటీన్ స్టఫ్ గా బయిటకు వచ్చింది. ఖచ్చితంగా ఇది మారుతి చిత్రం కాదు అనిపిస్తుంది. ఫస్టాఫ్ …సప్తగిరి కామెడీతో బాగానే అనిపించినా సెకండాఫ్ కథకు సంభంధం లేకుండా తిరుగుతూ ఫార్ములా క్లైమాక్స్ తో ముగింపుకు వచ్చింది. నటన విషయం వదిలేస్తే అల్లు శిరీష్ కు…గౌరవం సినిమాకన్నా బెటరే అనాలి. ఉన్నంతలో రెజీనా, సప్తగిరి బాగా చేసారు. ‘కొత్త జంట’ సినిమా ప్రెజెంటేషన్ కొత్తగా ఉంది కానీ అంచనాలను అందుకునే రేంజ్ లో మాత్రం లేదు. రెజీనా పెర్ఫార్మన్స్, కొన్ని కామెడీ ఎలిమెంట్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ సినిమాకి ప్లస్ అయితే బోరింగ్ ఎలిమెంట్స్ ఉండడం, చాలా చోట్ల సాగదీయడం, స్లో స్క్రీన్ ప్లే చెప్పదగిన మైనస్ పాయింట్స్. మారుతి గత సినిమాలను దృష్టిలో పెట్టుకొని వెళ్ళేవారు మాత్రం కాస్త నిరుత్సాహపడతారు. అలాగే మారుతికి ఉన్న పేరు వల్ల మొదటి వారం కలెక్షన్స్ రాబట్టుకునే అవకాశం ఉంది.

shakeela life  no romance feeling.gif

పెళ్లికానీ ప్రసాద్ లకు , పెళ్లైన వారికి షకీల ఒక శ్రుంగార దేవత అని అందరు అంటారు. కానీ ఈ శ్రుంగార దేవతకు ఆ కోరికలు కలగకపోవటం నిజంగా షాక్ న్యూసే అని మగరాజులు అంటున్నారు. ఆమె రాసిన జీవితం పుస్తకంలో ఈ విషయం బయటపడింది. ఆల్కహాల్ తీసుకొనేటప్పుడు- పురుషుల కన్నా మహిళల కంపెనీనే నేను ఎక్కువగా కోరుకుంటాను. తాగిన తర్వాత పురుషులు తమ కామాన్ని వెల్లడిస్తారు. వారితో కలిసి తాగుతున్నానంటే వారి కోరికలు తీర్చటానికి నేను సిద్ధంగా ఉన్నాననుకుంటారు.

అలాంటి వాళ్లను చూస్తే జాలేస్తుంది. వారి జీవితంలో భావ దారిద్య్రం ఎక్కువ. వారికి జీవితంలో సెక్స్ తప్ప వేరే భావన ఏదీ లేదా అనిపిస్తుంది. మహిళలతో అయితే ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. వారిని కౌగిలించుకోవచ్చు. పట్టుకొని డ్యాన్స్ చేయచ్చు. వారు నా నుండి వేరే ఏం ఆశించరు కదా! ఈ పనులు పురుషులతో చేయలేను… సినిమాలో బెడ్‌రూం సీనుల్లో నటించేటప్పుడు- శృంగార భావనలు కలుగుతాయా? అనే ప్రశ్నను చాలా మంది అడుగుతూ ఉంటారు. షూటింగ్ జరిగేటప్పుడు మొత్తం యూనిట్ అంతా ఉంటుంది.

అందరూ చూస్తున్నప్పుడు సెక్స్ ప్రేరణలు ఎలా కలుగుతాయి? మహిళలకు సంబంధించినంత వరకూ శృంగారమనేది శరీరానికి సంబంధించినది మాత్రమే కాదు. మానసిక అనుబంధం లేకపోతే సెక్స్‌ను ఆనందించలేరు. నేను చిత్రాల్లో చేసేది కేవలం నటన మాత్రమే. నటిస్తున్నప్పుడు నాకెప్పుడూ సెక్స్ కోరికలు కలగలేదని చెప్పి కామరాజుల గుండెల్లో గాయం చేసిందని షకీలా అభిమానులు అంటున్నారు.

 ఇప్పటి వరకు ప్రిన్సు మహేష్ బాబుకు తెలుగు ఇండస్ట్రీలో క్లీన్ చీట్ ఉంది. వివాదాలకు ఆమడదూరంలో ఉంటాడని.. తన పని మాత్రమే తాను చూసుకొని వెళ్లిపోతాడని అంటారు. అయితే మొట్ట మొదటిసారి ఓ వివాదంలో మాత్రం కల్పించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ మీద మన దర్శకుల సంఘం బ్యాన్ విధించాలా? వద్దా అన్న తర్జన భర్జన జరుగుతున్న సంగతి తెలిసిందే.


మహేష్ ప్రస్తుతం ఆగడు సినిమా చేస్తుండగా ఈ సినిమా సెట్లోనే ప్రకాష్‌రాజ్‌ ఓ అసిస్టెంట్ దర్శకుడిపై దురుసుగా ప్రవర్తించారనీ.. అకారణంగా దుర్భాషలాడారనీ తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘానికి ఫిర్యాదు అండగా.. దీంతో దర్శకుల సంఘం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం ఇదంతా నాటకమేనని.. ఓ వ్యక్తి కావాలనే ఇలా చేస్తున్నాడని చెప్పాడు.

దీంతో దర్శక, నిర్మాతల సంఘం పెద్దలు ఇప్పుడు అసలు ఆ రోజు సెట్లో ఏమి జరిగింది అనే విషయం మీద దృష్టి పెట్టారట. ఈ క్రమంలో ఆ రోజు సెట్లో ఉన్న అందరినీ విచారించాలని అనుకుంటున్నారట. ఆ రోజు సెట్లో మహేష్ బాబు కూడా ఉండడంతో ఆయన సాక్ష్యంగా తీసుకునే అవకాసం ఉందంటున్నారు. మరి మహేష్ ఏ విధంగా ఈ వివాదంలో సమాధానం ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. మహేష్ ఎలా సాక్ష్యం చెప్తాడో చూద్దాం!

 నితిన్ హీరోగా దర్శకురాలు నందినీరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టును ఆపేశారు. ఈ విషయంపై నందినీ రెడ్డి మాట్లాడుతూ… “నితిన్‌తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాం. అంతా ఫైనలైజ్ అయ్యింది. కానీ రాష్ట్ర విభజన కారణంగా ఈ సినిమాను ఆపేయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా మొదలు పెడితే అనేక ట్యాక్స్ సమస్యలు వస్తాయని అర్థమైంది. అందుకే మేము చాన్స్ తీసుకోదలుచుకోలేదు. ఆ సమస్యలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి ఆలోచిస్తాం” అని చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీప్రముఖులు మాత్రం అలాంటిదేమీ లేదని అంటున్నారు. మరి నందినీ కేవలం ట్యాక్స్ సమస్యలు వస్తాయనే ఆపేసిందా లేక మరే ఇతర కారణమైన ఉందా అనే విషయం త్వరలోనే తెలియనుంది.

సాధారణంగా వస్త్ర దుకాణాలకి పాపులర్‌ హీరోయిన్లని మాత్రమే మోడల్స్‌గా తీసుకుంటారు. కానీ నదియాకి ఉన్న పాపులారిటీ దృష్ట్యా, ఆమెకి ఫ్యామిలీ ఆడియన్స్‌లో పెరిగిన క్రేజ్‌ దృష్ట్యా మిడిల్‌ ఏజ్‌ వారిని ఆకట్టుకోవడానికి ఈమెకి మించిన మోడల్‌ లేదని అనుకుంటున్నారు.

ఆర్‌.ఎస్‌. బ్రదర్స్‌ వారు కేవలం ప్రణీతతోనే కాకుండా నదియాతో కూడా బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌కి ఒప్పందం చేసుకున్నారు. ఇద్దరితో కలిపి ఫోటోషూట్‌ చేసి ఒకేసారి అన్ని వయసుల వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ మాటకి ఆమాటే చెప్పుకోవాలంటే ప్రణీత కూడా నదియా ముందు తేలిపోయింది. ఆమె హుందాతనం ముందు… వయసు పెరిగినా తరగని అందం ముందు ప్రణీత వెలవెలబోయింది. ఇది చూసాక మరోసారి ఎవరినైనా యువ హీరోయిన్‌ని వచ్చి నదియాతో ఫోటో షూట్‌ చేయమంటే ససేమీరా అనేస్తారేమో కూడా.

గజిబిజి షెడ్యూల్స్‌తో బిజీబిజీగా వున్న శృతి హాసన్ ఇప్పుడు తన సినిమా డేట్లు అడ్జస్ట్ చేసుకోలేక జుట్టుపీక్కుంటోంది. ఈ టెన్షన్‌లోనే తన తండ్రి కమల్ హాసన్‌కి  కూతురుగా కనిపించే ఛాన్స్‌ని కోల్పోయింది. కమల్ హాసన్ లేటెస్ట్ తమిళ్ మూవీ ‘ఉత్తమ విలన్’లో ఆయనకు కూతురి పాత్రలో నటించే ఆఫర్ ఇచ్చాడు దర్శకుడు రమేష్ అరవింద్.

అటు తమ అభిమాన కథానాయకుడు కమల్, ఆయన కూతురు శృతి హాసన్ ఇద్దరూ కలిసి రీల్ లైఫ్‌లోనూ తండ్రీ కూతుళ్ల పాత్రలో కనిపిస్తున్నారని తెలిసి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారట. కానీ ఇప్పటికే తాను ఒప్పుకున్న సినిమాలతో బిజీబిజీగా వున్న శృతికి ఈ ఆఫర్‌ని వదులుకోకతప్పలేదు. డ్యాడీకి కూతురుగా కనిపించే ఛాన్స్ కోల్పోతున్నానని ఆమె కూడా ఫీలవుతోందట. తమిళంలోనే తెరకెక్కిన ‘పూ’ మూవీ ఫేమ్ పార్వతిని ఈ పాత్రకోసం ఓకే చేశారు.